ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు..! 1 d ago
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల మండిపడ్డారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని..కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని విమర్శించారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే..పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా అని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి..ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు.